ఈ జీకే ఆధారిత సాధారణ శాస్త్రం రసాయన శాస్త్రంకు సంబంధించినది, ఇది అన్ని పోటీ పరీక్షల కోసం ఉద్దేశించబడింది.
రసాయన శాస్త్రం పరిచయం
పదార్థాల సంఘటనం, నిర్మాణం, మరియు వాటి చర్యల గురించి చదివే శాస్త్రమును 'రసాయన శాస్త్రం' అంటారు.
రసాయన శాస్త్ర పితామహుడు - రాబర్ట్ బాయిల్, ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు - లెవోయిజర్ (1743-1794).
పదార్థం పరమాణువుల, అణువుల సమ్మిళితం అని మొదట చెప్పిన భారతీయ తత్త్వవేత్త కణాదుడు.
పరమాణు సిద్ధాంతాన్ని మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త జాన్ డాల్టన్ (1808).
పదార్థం యొక్క భౌతిక వర్గీకరణ: ఘన, ద్రవ, వాయు పదార్థాలు. పదార్థం యొక్క నాలుగవ స్థితి ప్లాస్మా స్థితి, ఐదవ స్థితి బోస్-ఐన్‌స్టీన్ సంక్షేపణ స్థితి.
పదార్థం యొక్క రసాయన వర్గీకరణ: మిశ్రమాలు (సజాతీయ, విజాతీయ) మరియు శుద్ధ పదార్థాలు (మూలకాలు, సమ్మేళనాలు).
మూలకాలు (Elements) మూడు రకాలుగా వర్గీకరించబడ్డాయి: లోహాలు, అలోహాలు, మరియు అర్ధ లోహాలు.
సమ్మేళనాలు (Compounds) రెండు రకాలు: కర్బన సమ్మేళనాలు (Organic Compounds) మరియు అకర్బన సమ్మేళనాలు (Inorganic Compounds).
పరమాణు నిర్మాణం
డాల్టన్ పరమాణు సిద్ధాంతంలోని ప్రధానాంశాలు: మూలకాలు అవిభాజ్య కణాలైన అణువులను కలిగి ఉంటాయి, ఒకే మూలకం పరమాణువులు సమానంగా ఉంటాయి, విభిన్న మూలకాల పరమాణువులు విభిన్నంగా ఉంటాయి, పరమాణువులు సృష్టించబడవు, నాశనం చేయబడవు.
పరమాణువులో ఉండే మూడు ముఖ్యమైన ప్రాథమిక కణాలు: ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్.
ఎలక్ట్రాన్‌ను కనుగొన్నది జె.జె.థాంసన్.
ధన కిరణాల ప్రయోగం జరిపిన శాస్త్రవేత్త గోల్డ్ స్టీన్.
న్యూట్రాన్‌ను కనుగొన్నది జేమ్స్ చాడ్విక్ (1932).
పరమాణు సంఖ్య (Z) కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య. పరమాణు ద్రవ్యరాశి సంఖ్య (A) ప్రోటాన్లు, న్యూట్రాన్ల మొత్తం సంఖ్య.
మూలకాల వర్గీకరణ - ఆవర్తన పట్టిక
డోబరైనర్ త్రిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
న్యూలాండ్స్ అష్టక నియమాన్ని సూచించాడు.
మెండలీవ్ ఆవర్తన నియమం: మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు.
ఆధునిక ఆవర్తన నియమం: మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు (మోస్లే).
ఆవర్తన పట్టికలో మొత్తం పీరియడ్ ల సంఖ్య ఏడు మరియు మొత్తం గ్రూపుల సంఖ్య 18.
రసాయన బంధం
రసాయన బంధం: ఒక అణువులో రెండు పరమాణువుల మధ్య ఉన్న ఆకర్షణ బలం.
ప్రధాన రకాలు: అయానిక బంధం మరియు సంయోజనీయ బంధం.
అయానిక బంధం: లోహ, అలోహ పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ బదిలీ వల్ల ఏర్పడిన అయాన్ల మధ్య ఏర్పడుతుంది.
Get Knowledge Gainers updates on our WhatsApp and Telegram Channels